19-01-2026 12:03:01 AM
మహబూబాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మాస్టర్ ప్లాన్ పునరుద్ధరణ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా స్వాగతం పలికేందుకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదివారం మేడారం వెళ్లిన ఆమె వనదేవతలను సందర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం మేడారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం సమగ్రాభివృద్ధికి 251 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం, శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయన్నారు. సమ్మక్క సారలమ్మ దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.