13 March, 2026 | 4:46 PM

గాజులగూడెంలో ఘనంగా స్వయంపాలన దినోత్సవం

13-03-2026 03:43 PM

పాపన్నపేట,మార్చి13: పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై ఉపాధ్యాయ వృత్తిలోని గొప్పతనాన్ని స్వయంగా అనుభూతి చెందారు. అన్ని వృత్తులను తయారు చేసేది ఉపాధ్యాయ వృత్తి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.

డీఈవోగా మనోజ్ కుమార్, ఎంఈవో గా ప్రణవి, ప్రధానోపాధ్యాయురాలుగా చందన, పీఈటీలుగా చరణ్, శ్రీకర్, ఉపాధ్యాయులుగా అర్మాన్, ఆహిల్, శ్రావణి, నవ్యత, అశ్విత, అల్ఫియా, దృతిక, అనోన్యలు బాధ్యతలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయ విద్యార్థులకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిసిరి, రవీందర్, వేణుగోపాల్ వర్మ, సాయిలుచారి పర్యవేక్షించారు.