20 March, 2026 | 6:38 AM

జర్నలిస్టుల సంక్షేమానికి ఎమ్మెల్యే యెన్నం తొలి సంతకం

20-03-2026 12:00 AM
  1. రాష్ట్రవ్యాప్తంగా ఆలోచింపజేసిన ఎమ్మెల్యే నిర్ణయం 

ఎక్కడ లేని విధంగా ప్రతినెల రూ.లక్ష ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఉగాది పండుగ వేళ జర్నలిస్టుల సంక్షేమానికి అంకురార్పణ 

జర్నలిస్టులందరికీ సంక్షేమ సంఘంలో ప్రాముఖ్యత

మహబూబ్ నగర్, మార్చి 19 (విజయ క్రాంతి) : ప్రతి సమస్యను పరిష్కార రూపం దాల్చేందుకు నిరంతరం ప్రయత్నించే జర్నలిస్టు ల సమస్యలను పరిష్కరించే దిశగా మహ బూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి తొలి సంతకం చేశారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇ లాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రజలకు ఆ సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం.

అలాంటి జర్నలిస్టుల సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి అన్నిటిని పక్కనపెట్టి ప్రజా సమస్యలకే ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ నిరంతరం జర్నలిస్టులు శ్రమిస్తున్న విషయం విధితమే. అలాంటి జర్నలిస్టుల సంక్షేమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మనకు తెలిసినంతవరకు ఎక్కడ లేని విధంగా ప్రతినెల జర్నలిస్టుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకొని రూ 1 లక్ష ఇస్తానని ప్రకటించారు.

పనిచేసే ప్రతి జర్నలిస్టుకు సభ్యత్వం

 పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం లో ప్రతి జర్నలిస్టు సభ్యత్వం పొందవలసి ఉంటుంది. మహబూబ్ నగర్ ని యోజకవర్గంలో 2 52 మంది అక్రిడేషన్ కార్డులు ఉండగా యూట్యూబ్ చానల్స్ వారు కూడా పలు కీలక ప్రెస్మీట్లో కానీ ప్రజా సమస్యలను వెలిగితీయడంలో గాని కీలకంగా పనిచేస్తున్నారు. వర్కింగ్ జర్నలిస్టులుగా అందరికీ భావించి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అడుగులు వేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా చెబుతున్న మాట.

సీనియర్లు జూనియర్లు అనే భేదం లేకుండా రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు సైతం జర్నలిస్టు ల సంక్షేమ సంఘం అడుగులు వేస్తుంది. ఆపదలో ఉన్న జర్నలిస్టుకు తోటి జర్నలిస్టుల ఓదార్పు తో పాటు సంక్షేమ సం ఘం ద్వారా సమకూర్చే ఆర్థిక సహాయం కూడా ఎంతో భరోసానిస్తుంది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆలోచనలో నుంచి ఆవిష్కృతమైన పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సం ఘం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును పొందుతుంది. 

 జర్నలిస్టుల సంక్షేమానికి తొలి సంతకం 

ఆపద వచ్చింది అంటే చాలు ఆ నాయకుడు ఈ నాయకుడిని అడిగి అప్పటికప్పుడు వారు అందుబాటులో లేకుంటే ఇబ్బందులు గురికాకుండా జర్నలిస్టుల సంఘం ఉంటే ఎంతో మేలు చేకూరుతుందని సంకల్పంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉగాది, రంజాన్ పండుగ పర్వదినాలను పుర స్కరించుకొని రూ 1 లక్ష చెక్ ను సంక్షేమ సంఘం ప్రతినిధుల కు అందజేశారు.

ప్రతి విషయంలో పక్కా ప్రణాళికలతో నియమ నిబంధనలను పాటిస్తూ నిరుపేద జర్నలిస్టులకు ఆపద వస్తే మేమున్నామని భరోసా సంక్షేమ సంఘం ఇవ్వాలని ఎమ్మెల్యే పేర్కొంటూ నూతన అడుగులకు సరికొత్త నిర్వచనంగా ఉండాలని ఎమ్మెల్యే పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో విధివిధానాలు అమలు చేస్తూ సంక్షేమ సంఘం జర్నలిస్టుల మేలు కోసం నిరంతరం పనిచేస్తుందని జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు చెబుతున్న మాట.