28 June, 2026 | 3:43 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

చరికొండపై ఎమ్మెల్యే ప్రత్యేక నజర్

20-02-2026 02:14 AM

రహదారుల విస్తరణ, కొత్త బస్సు సర్వీసులకు హామీ!

కడ్తాల్, ఫిబ్రవరి 19( విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధియే ధ్యేయంగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కడ్తాల్ మండలం లో ని చరికొండ గ్రామ పరిధిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల ఏమ్మెల్యే కసిరెడ్డి దృష్టి కి గ్రామం లో పలు సమస్యలను సర్పంచ్ మహేందర్ గౌడ్ తీసుకెళ్లారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. యాచారం మండలంలో ని తక్కళ్ళ పల్లి నుండి పల్లె చెల్క తండా వరకు కొనసాగుతున్న 40 అడుగుల ఆర్‌అండ్‌బీ రహదారిని చరికొండ వరకు పొడిగించాలని ఎమ్మెల్యే  సంకల్పించారు.

ఈ మేరకు ఆయ న ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో మరియు ఆర్ అండ్ బీ చైర్మన్ మల్రెడ్డి రామ్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడారు. చరికొండ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు ఈ రోడ్డు పొడిగింపు అత్యవసరం‘ అని ఎమ్మెల్యే వివరించగా, మంత్రి మరియు చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ వెంటనే పనులు చేపడతామని హామీ ఇచ్చారు. 

ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ

ప్రయాణికుల సౌకర్యార్థం కోసం కల్వకుర్తి డిపో మేనేజర్తో ఎమ్మెల్యే  మాట్లాడి  ఆమనగల్ - మాల్ మరియు చరికొండ - ఇబ్రహీంపట్నం మార్గాల్లో వెంటనే బస్సులు నడపాలని సూచించారు. దీనిపై స్పందించిన డిపో మేనేజర్ సోమవారం రూట్ పరిశీలన చేసి వెంటనే బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కు వివరించారు.అనంతరం చరికొండలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా,

ఈ నెల 22వ  నిర్వహించే కళ్యాణోత్సవానికి రావాలని సర్పంచ్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో చరికొండ సర్పంచ్ అద్దాల మహేందర్ గౌడ్, ఏక్వయిపల్లి సర్పంచ్ కరుణాకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు రౌతు వెంకటయ్య గౌడ్, రమేష్ నాయక్, ఆలూరి సత్యం గౌడ్, గుజ్జులా మహేష్ తదితరులు పాల్గొన్నారు.