26-05-2025 12:25:33 AM
భద్రాచలం, మే 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పర్యటనకు వచ్చిన రాష్ట్ర శాసన మండల సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ దంపతులు ఆదివారం ఉదయం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అధికారులు సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.