22 May, 2026 | 11:46 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

18-03-2026 06:22 PM

- మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి

జడ్చర్ల: ఉగాది రాకతో వసంతం మొదలై తరువులు కొత్త చిగురులు తొడుగుతాయని, మన జీవితాల్లోనూ కొత్త ఆశలు,మంచి సంకల్పాలు ప్రారంభం కావాలని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. నూతన తెలుగు సంవత్సరం ప్రజల కుటుంబాల్లో ఆర్థిక,ఆరోగ్య,సంతోషాలను నింపాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని సుఖ-దుఃఖాలు సహా వివిధ అనుభవాలను సూచిస్తాయని వాటిని సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తాయన్నారు. పరాభవ అంటే మనలోని అహంకారాన్ని,చెడు ఆలోచనలను ఓడించి విజయానికి పునాది వేసేదన్నారు.తెలుగు ప్రజల సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి  ఆకాంక్షించారు.