26-05-2025 12:26:29 AM
- జీహెచ్‌ఎంసీ ట్రాన్స్పోర్ట్ వాహనాలను యథావిధిగా కొనసాగించాలి కమిషనర్‌కు వినతి
- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్
ముషీరాబాద్, మే 25: (విజయక్రాంతి): ప్రస్తుతం జిహెచ్‌ఎంసి ట్రాన్స్పోర్ట్ నందు నడుస్తున్న వాహనాలను తొలగించకుండా యధావిధిగా కొనసాగించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సో ర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు జిహెచ్‌ఎంసి కమిషనర్ కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ మేర కు ఆదివారం కవాడిగూడ లోని జిహెచ్‌ఎంసి గ్యారేజ్ లో యూనియన్ ప్రతిని ధుల తో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రస్తు తం రన్నింగ్ కండిషన్‌లో ఉన్న వాహనాలను యధావిధిగా కొనసాగిస్తూ ప్రస్తుతం పూర్తిగా పాడైన వాహనాలను తీసివేయటం మాత్రమే అనుమతించాలన్నారు కొత్త వా హనాలు కొనుగోలు చేయుటకు ప్రభు త్వం నుండి అనుమతి వచ్చే వరకు పాత వాహనాలను ఫిట్నెస్ చేయించి పాత వాహనాలనే కొనసాగించాలన్నారు.
ఇదే లేబర్ డ్రైవర్లు స్వచ్ఛ సర్వేక్షన్ సమయంలో రెండు సార్లు జిహెచ్‌ఎంసికి అవార్డు పొందడానికి దోహదపడ్డారన్నారు వీరి కష్టం వల్ల సిహెచ్ జిహె చ్‌ఎంసి స్వచ్ఛ సర్వేక్షన్ లో విజయం సాధించడం జరిగిందన్నారు. అత్యంత ఆపద కాలంలో, కరోనాకాలంలో మొత్తం ట్రా న్స్పోర్ట్ వాహనాలు హాస్పిటల్ యొక్క చెత్త ను, వీధిలోని చెత్తను రేయింపవళ్లు తొలగించారన్నారు.
కరోనా లో చనిపోయిన వ్యక్తుల శవాలను కూడా ట్రాన్స్పోర్ట్ వాహనాల్లోనే తరలించడం డ్రైవర్లు వర్కర్లు అందరు కలిసి ఆ శవాలను దహనం సంస్కారాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కరోనా పరిస్థితిల్లో రాంకీ సంస్థ ఎలాంటి పని కూడా చేయలేదన్నారు. రామ్కీ సంస్థ చేసుకున్న అగ్రిమెంటు కేవలం సానిటేషన్ ను సంబంధించిన వాహనాలను మాత్రమే నడపడం జిహెచ్‌ఎంసి యొక్క మిగతా విభాగాలలో రామ్కీ సంస్థకు ఎలాంటి అగ్రిమెంట్ లేదన్నారు.
ఉదాహరణకు ఇంజనీరింగ్, వెట ర్నరీ అగ్రికల్చర్, ఎంటమాలజీ అధికారుల వాహనాలను జిహెచ్‌ఎంసి కొత్త వాహనాలు కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న డ్రైవ ర్లను వర్కర్లను వాటిపైనే ఉపయోగించుకోవచ్చన్నారు. రాంకీ సంస్థకు జిహెచ్ ఎంసి నుండి 100% పని పూర్తిగా ఇవ్వవద్దన్నారు. ఇప్పుడున్న డ్రైవర్లు గత 20 సంవ త్సరాల నుండి పనిచేస్తున్నారని అలాంటి వారిని జిహెచ్‌ఎంసి నుండి ఈవిడిఎం కు 814 మందిని పంపించడం జరిగిందన్నారు.
వా రిని తిరిగి ఈవిడిఎమ్ హైడ్రా నుండి వారిని జిహెచ్‌ఎంసిలోనికి పంపారన్నారు. పంపి న వారికి రెండు నెలల గడుస్తున్నా జీవితాలు కూడా లేవన్నారు. ఈ విషయమై స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కమిషనర్ను కోరినట్లు ఆయన వెల్లడించారు.
ఈ విషయమై స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బండారి యాదగిరి సంపూర్ణ మద్దతు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి. జహీరు ద్దీన్ జగదీష్, బి. బాల నర్సయ్య, యు. వెంకటేష్, సిహెచ్. నగేష్, బాలరాజు, కుమార్, బలవంత్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.