17 July, 2026 | 5:53 AM

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మొదలు

06-06-2024 12:24 AM

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్

భద్రతా ఏర్పాట్ల మధ్య నల్లగొండలో లెక్కింపు ప్రక్రియ

రాత్రి 11 గంటల వరకు 96,000 ఓట్ల లెక్కింపు

ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ?

సూర్యాపేట/ ఖమ్మం, జూన్ 5 (విజయక్రాంతి): నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ పట్టణంలోని గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోదాములో బుధవారం ఉదయం ప్రారంభమైంది. రాత్రి 11 వరకు సిబ్బంది 96,000 వేల లెక్కించినట్లు తెలిసింది. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్లకు 12,000 ఓట్ల ఆధిక్యత వచ్చినట్లు సమాచారం.

ఆ తర్వాతి స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఉన్నట్లుగా తెలిసింది. ఎన్నికల అధికా రులు కౌంటింగ్ కోసం నాలుగు హాల్స్‌లో 96 టేబుళ్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టిన తర్వాత  ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఎన్నికలో మొత్తం 3,03,613 ఓట్లు పోల్ అయ్యాయి.

కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గజ్జుల ప్రేమేందర్ రెడ్డితోపాటు మరో 49 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. 2 వేల మంది సిబ్బంది, అధికారులు కౌంటింగ్ విధుల్లో పాల్గొన్నారు. సిబ్బంది ఒక రౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. గురువారం సాయంత్రం లోపు ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తున్నది. కౌంటింగ్  కేంద్రం వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.