23 July, 2026 | 10:58 PM

ఎమ్మెల్సీ జీవన్, ఎమ్మెల్యే సంజయ్ రగడ.. ప్లెక్సీల వివాదం

28-06-2024 06:04 PM

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకతో మొదలైన వివాదం సద్దుమణిగిందని కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వివాదం మళ్ళీ శుక్రవారం  జిల్లా కేంద్రంలో ప్లెక్సీల రూపంలో రాజుకుంది. జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సంజయ్ కుమార్ అనుచరులు నియోజక వర్గ అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి కౌంటర్ గా జగిత్యాల అంటే ఎమ్మెల్సీ జీవన్ అభివృద్ధి అనేది ఆయనతోనే అంటూ జీవన్ రెడ్డి అనుచరులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అంతర్యుద్ధం ఆరంభం అయిందని, ఆరనిజ్వాలల మండుతూనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవడం గమనార్హం.