24 July, 2026 | 12:07 AM

జైలు నుంచి విడుదలైన జార్ఖండ్‌ మాజీ సీఎం

28-06-2024 05:28 PM

రాంచీ: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు. జస్టిస్ రోంగోన్ ముఖోపాధ్యాయ కోర్టు అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ జైలు నుండి బయటికి రాగానే, పెద్ద సంఖ్యలో జేఎంఎం కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. భూ కుంభకోణం కేసులో జనవరి 31న సోరెన్‌ అరెస్ట్ అయ్యారు. హేమంత్ సోరెన్ ఐదు నెలలు జైల్లో ఉన్నారు.