తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు: హరీశ్ రావు
29-08-2024 11:56 AM
హైదరాబాద్: తెలుగువారందరికీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా, సంగీతాత్మకమైన అజంత భాషగా వినుతికెక్కింది మన తెలుగు అని పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా నవ కాంతులు విరజిమ్ముతున్న గొప్ప వెలుగు మన తెలుగు అన్నారు. మాతృభాషలు మసకబారుతున్న విషమ సందర్భంలో తెలుగు వెలుగును కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రతిఒక్కరికీ హరీశ్ రావు అభినందనలు తెలిపారు.






