19 August, 2026 | 10:13 PM

మూడో త్రైమాసికంలోనూ మొబిక్విక్‌ రూ.7.6 కోట్ల నికర లాభం

19-08-2026 09:02 PM

హైదరాబాద్, భారత్‌, ఆగస్టు 2026: భారతదేశపు అతి పెద్ద డిజిటల్ వాలెట్ సేవల సంస్థ అయిన వన్ మొబిక్విక్‌ సిస్టమ్స్ లిమిటెడ్ (మొబిక్విక్‌) జూన్ 30, 2026తో ముగిసిన త్రైమాసికానికి (Q1 FY27) తన ఆదాయ ఫలితాలను ఈరోజు ప్రకటించింది. కంపెనీ వరుసగా మూడో త్రైమాసికంలో లాభదాయకతను నమోదు చేయడంతో పాటు ₹7.6 కోట్ల PAT సాధించింది, YoYలో ఇది ₹49.5 కోట్ల వృద్ధి. తద్వారా, వేగంగా విస్తరిస్తూ లాభదాయకంగా ఎదుగుతున్న భారత ఫిన్‌టెక్‌ సంస్థల్లో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

Q1 FY27 త్రైమాసికం మొబిక్విక్‌ లాభదాయక ప్రయాణానికి  కొనసాగింపుగా నిలుస్తుంది. డిసిప్లిన్‌డ్‌ cost management, Payments Business మరియు Financial Services Businessలో మెరుగైన ఆదాయ ఆర్జన ఫలితంగా Contribution Profit YoYలో 66%కు పెరిగింది. ప్లాట్‌ఫామ్‌ GMV త్రైమాసిక ప్రాతిపదికన కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేయగా, Financial Services బిజినెస్‌ స్థిరమైన ఆదాయ వృద్ధితో పాటు అనుకూలమైన Gross Profit marginsను నమోదు చేసింది.

పనితీరుపై వ్యాఖ్యానిస్తూ, మొబిక్విక్‌ సహ-వ్యవస్థాపకుడు, ఎండీ & సీఈఓ అయిన బిపిన్ ప్రీత్ సింగ్ ఇలా అన్నారు: "వృద్ధిలో నిరంతర పెట్టుబడులతో పాటు వరుసగా మూడు లాభదాయక త్రైమాసికాలను సాధించడం ద్వారా, మా వ్యాపార నమూనాలో లాభదాయకత అంతర్లీన భాగంగా మారిందని 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోని మా పనితీరు నిరూపించింది. పేమెంట్ బిజినెస్ లో, మేము వరుసగా 14 త్రైమాసికాల పాటు రికార్డు స్థాయి GMV అందించాము, మెరుగైన యూనిట్ ఎకనామిక్స్‌తో సంవత్సరానికి 50% వృద్ధిని సాధించాము. లెండింగ్‌ బిజినెస్‌లో, మేము గ్రాస్ ప్రాఫిట్ ను సంవత్సరానికి 5.6 రెట్లు పెంచుకున్నాము, ఇది పటిష్టమైన క్రెడిట్ నాణ్యతను, బలమైన పోర్ట్‌ఫోలియో రికవరీలను ప్రతిబింబిస్తుంది.

పేమెంట్ బిజినెస్ లో మా నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడం, మా డిజిటల్ ఫైనాన్షియల్  సర్వీసెస్  ఎకోసిస్టమ్‌ను విస్తరించడం, మా వినియోగదారులు మరియు వాటాదారులకు దీర్ఘకాలిక స్థిరమైన విలువను సృష్టించడంపై మేము దృష్టి సారించామనీ తెలిపారు.క్రెడిట్‌ రిస్క్‌ పనితీరు సుమారు 25% మెరుగుపడింది, మొత్తం రుణాల్లో 60% పునరావృత వినియోగదారులకే మంజూరయ్యాయిఈ అన్ని కొలమానాల్లో నమోదైన మెరుగుదల, రుణాల వ్యాపారంలో సాధించిన బలమైన పనితీరును ప్రతిబింబిస్తుంది.లాభదాయకతను పటిష్టంగా తిరిగి సాధించిన నేపథ్యంలో, సంస్థ తన డిజిటల్‌ ఆర్థిక సేవల పోర్ట్‌ఫోలియో అంతటా వృద్ధిని క్రమబద్ధమైన, స్థిరమైన పద్ధతిలో వేగవంతం చేయడానికి అనుకూల స్థితిలో ఉంది.