‘ఆర్‌జీసీఏహెచ్’కు దరఖాస్తుల స్వీకరణ
12-07-2026 12:00 AM
సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌కు సిద్ధమవుతు న్న అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ (ఆర్‌జీసీఏహె చ్) పథకాన్ని కొనసాగిస్తున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన తెలంగా ణ ప్రాంత అభ్యర్థుల్లో అర్హులైన ప్ర తీ ఒక్కరికీ సింగరేణి సంస్థ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేస్తామని, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.






