ప్రజల భాగస్వామ్యంతో మోడల్ పోలీస్
నిర్మల్ జిల్లాలో డీజీపీ విస్తృత పర్యటన
భరోసా బాధితులకు సాయం అందజేత
నిర్మల్, ఏప్రిల్ ౧౪ (విజయక్రాంతి): నిర్మల్‌లో ప్రారంభించిన పోలీస్ అక్క నారిశక్తి శివంగి దళం మహిళా పోలీసుల స్ఫూర్తి జాతీ య స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి నిర్మల్ టౌన్ సోన్ మండల కేంద్రంలో నిర్వహించిన వివిధ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొదట నిర్మల్ పట్టణంలోని రూలర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అక్కలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి మహిళా పోలీసులకు స్కోచ్ అవార్డులు అందజేశారు. ఎల్ల పెళ్లి శివారులో భరోసా కేంద్రాన్ని ప్రారంభించి అక్కడ కౌన్సిలింగ్ ద్వారా ఒక్కటైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఎస్పీ క్యాంప్ కార్యాల యం నిర్మాణం పనులపై ఆరా తీశారు. జాతీయస్థాయిలో నిర్మల్ పోలీస్ గుర్తింపు తెచ్చుకో వడం అభినందనీయమని ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు.
డ్రైవర్లకు ఆరోగ్య కిట్లు పంపిణీ
నిర్మల్ నాగపూర్ జాతీయ రహదారిపై సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద రోడ్ సేఫ్టీ నియమాలపై డ్రైవర్లకు క్లీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సుదూర ప్రయాణం చేస్తున్న లారీ డ్రైవర్లకు క్లీనర్లతో ముఖాముఖి మాట్లాడి ప్రయాణంలో ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నా రు. వారికి ఆరోగ్య కిట్లను అందించారు. లారీలకు స్టిక్కర్లు వేసి మీరు మీ పిల్లలు జాగ్రత్త అంటూ భుజం తట్టారు. రోడ్డు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు
మండల కేంద్రంలో ప్రతిజ్ఞ
మండల కేంద్రానికి వచ్చిన రాష్ట్ర డిజిపి బీ శివధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల కు ఆదివాసి సంప్రదాయ పద్ధతిలో గుస్సాడీ ముత్యాలతో స్వాగతం పలికారు. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూజలు చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ఆరైవ్ అలైన్ కార్యక్రమానికి వస్తున్న వారికి విద్యార్థులు యువకులు పూల వర్షం తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎక్కువగా యువత చనిపోతున్నారని దీనికి అనేక కారణాలు ఉన్న రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ముఖ్య కారణమన్నారు.
జోకులు మహిళలతో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18 వరకు నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో యువత ముందుకు వచ్చి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దని తీర్మానం చేయాలన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ ప్రజల భాగస్వామ్యంతో అనేక విజయాలు సాధించిందని అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సుఖదేవ్ సుహంత్ బుబడే ఏఎస్పీలు సాయికిరణ్ రాజేష్ మీనా. డిపిఓ శ్రీనివాస్. డీఎస్‌ఓ సుధాకర్ సర్పంచ్ వనజా కృష్ణ ప్రసాద్ రెడ్డి సిఐలు పోలీసులు పాల్గొన్నారు.






