10 March, 2026 | 10:26 AM

మోడల్ విలేజ్ సృష్టికర్త కన్నుమూత

09-03-2026 12:08 AM
  1. గుండెపోటుతో రాజమౌళి కన్నుమూత
  2. మాజీ సీఎం కేసీఆర్ సంతాపం

మహబూబాబాద్, మార్చి 8 (విజయక్రాంతి) : దేశంలో ఆదర్శవంతమైన గ్రామం గా గుర్తింపు పొందిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి (65) గుండెపోటుతో మరణించారు. 1990లో జరిగిన గ్రా మపంచాయతీ ఎన్నికల్లో ఆయన తొలిసారి సర్పంచ్‌గా ఎన్నికై గ్రామస్తులను సంఘటిత పరిచి, ఒకే వేదిక పైకి తీసుకువచ్చి 100 శా తం అక్షరాస్యత, సంపూర్ణ మధ్య నిషేధం, స్వచ్ఛతకు మారుపేరుగా గ్రామాన్ని నిలిపి 2007లో నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డును అందుకునేలా కృషి చేశారు.

దేశవ్యా ప్తంగా పేరు గడించిన గంగదేవిపల్లి గ్రామం దేశ విదేశాల నుంచి ప్రతినిధులు అభివృద్ధికి నమూనాగా ఉన్న గ్రామాన్ని సందర్శించడం జరిగేది. రాష్ట్ర ముఖ్యమంత్రులు మొదలుకొని ప్రధాని వరకు రాజమౌళి పేరు గ్రామ అభివృద్ధిలో అ నేక పర్యాయాలు ప్రస్తావించిన సం ఘటనలు ఉన్నాయి. రెండుసార్లు సర్పంచిగా విధులు నిర్వహించడంతోపాటు ఊక ళ్లు సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 

పంచాయతీరాజ్ వ్యవస్థకు తీరని లోటు: కేసీఆర్

రాజమౌళి మరణం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు తీరని లోటని బీఆర్‌ఎస్ అధి నేత కేసీఆర్ అన్నారు. ఆయన మరణం పట్ల కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన తెలంగాణ పల్లెగా, గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో రాజమౌ ళిది కీలక పాత్ర అని కేసీఆర్ తెలిపారు.

గ్రామాభివృద్ధిలో ప్రజల ను భాగస్వా మ్యం చేసి, అన్ని రంగాలను అభివృద్ధి పరిచి, గ్రామీణ ఆర్థిక వ్యవ స్థను బలోపేతం చేస్తూ, పల్లెల అభ్యున్నతికి అసలైన నిర్వచనం చెప్పిన వ్యక్తి కూసం రాజ మౌళి అని కేసీఆర్ కొనియాడారు. దేశంలోని గ్రామాలు ఒక ఆదర్శవం తమైన సర్పంచిని కోల్పోయాయని కేసీఆర్ విచారం వ్య క్తం చేశారు. తనతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.