కాంగ్రెస్‌తోనే మహిళాభివృద్ధి
మహిళా దినోత్సవంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
మంథని, మార్చి 8 (విజయక్రాంతి): మహిళల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. ఆదివారం మంథని పట్టణంలో కౌన్సిలర్ మారుపాక నిహారిక అధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు. సృష్టికి మూలం మ హిళలేనని, మహిళలను గౌరవించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉం దని తెలిపారు.
ఇంకా కూడా మహిళలు అభద్రతా భావంలో ఉన్నారని అర్ధరాత్రి ఒంట రిగా ప్రయాణించాలంటే స్వేచ్ఛ లేకుండా ఉందన్నారు. మహిళలను ప్రోత్సహిస్తే సమా జం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయ న పిలుపు నిచ్చారు. చట్ట సభల్లో మహిళలకి సముచిత స్థానం కల్పిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అక్కడికి వచ్చి న మహిళలందరికీ అర్థమయ్యేలా ఎల్‌ఈడి స్క్రీన్‌పై మహిళల గొప్పతనాన్ని శ్రీను బా బు వర్ణించారు.
కార్యక్రమంలో ఏఎంసి చైర్మ న్ కుడుదల వెంకన్న, మున్సిపల్ చైర్మ న్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు మారుపాక నిహారిక, జంబోజు శ్రీమతి, లైసెెట్టి రజిత, కుర్ర లింగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ శర్మ, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు సెగ్గం రాజేష్, లింగయ్య యాదవ్, డిగంబర్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.




