18 July, 2026 | 12:53 AM

హనుమకొండలో మోస్తరు వర్షం

18-07-2026 12:53 AM
  1. రోడ్లపై నిలిచిన వరద నీరు 
  2. చల్లబడిన నగరం

హనుమకొండ (మహబూబాబాద్), జులై 17 (విజయక్రాంతి): నిన్న మొన్నటి వరకు ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వరంగల్ మహానగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయి శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి జలమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరంగల్, హనుమకొండ, కాజీపేట త్రినగరిలో వర్షం కురిసింది. హనుమకొండ కొత్త బస్టాండ్, చౌరస్తా ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వరద నీటితో కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ ఎండ తీవ్రత పూర్తిగా తొలగిపోవడంతో ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగించింది.

నేడు భారీ వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. శుక్రవారం హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వ ర్షం కురిసింది.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, బేగంపేట, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, సనత్ నగర్, మెహిదీపట్నం, చందానగర్, లింగంపల్లి, మి యాపూర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. ములు గు, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువగా, వనపర్తి, సంగారెడ్డి, నల్లగొండ, జయశంకర్, కామారెడ్డి, నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.