18 July, 2026 | 12:50 AM

దిల్‌సుఖ్‌నగర్‌లో మాంగళ్య ఏర్పాటు

18-07-2026 12:50 AM

షాపింగ్ మాల్ 32వ శాఖను ప్రారంభించిన సినీ నటి మీనాక్షి చౌదరి

హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): 2012లో తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన మాంగళ్య, ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ఉనికిని చాటింది. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో 32వ శాఖను గురువారం ఘనంగా ప్రారంభించింది.

ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని వివిధ వి భాగాలను సందర్శించి, అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ దిల్‌సు ఖ్‌నగర్ ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉంది.. వారి ఆశీర్వాదాలతో ఈ మాల్ మరింత విజయవంతమవుతుంది అని అన్నారు.

మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూ ర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ ప్రతి వ ర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహస్యం అని తెలిపారు. మా స్వంత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్ చేసి, వస్త్ర వ్యా పారంలో ముందంజలో కొనసాగుతున్నాం అని పేర్కొన్నారు.

ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య షాపింగ్ మాల్, రాబోయే రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 10 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనుండగా, భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్రానికి కూడా విస్తరిం చనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన మాంగళ్య షాపింగ్ మాల్, పాన్ ఇండియా స్థాయిలో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ప్రజలు తమ తమ శుభ కార్యక్రమం ఏది ఉన్న ఒకసారి మాంగళ్య షాపింగ్ మాల్‌కు సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఒక నూతన షాపింగ్ ఒరవడి సృష్టించాలని డైరెక్టర్స్ కోరారు.