calender_icon.png 11 November, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"మేడిన్ ఇండియా చిప్" స్వప్నమే.. నా శ్వాస: ప్రధాని మోదీ

11-09-2024 04:42:19 PM

న్యూఢిల్లీ: సెమికాన్ 2024 కాన్ఫరెన్స్ లో సెమీకండక్టర్ల రంగానికి చెందిన కంపెనీల ప్రతినిధులు,  నిపుణులను ఉద్దేశించి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోని ప్రతి పరికరంలో భారత్ లో తయారైన మేడిన్ ఇండియా చిప్ ఉండాలన్న స్వప్నాన్ని నేను శ్వాసిస్తానని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం త్రీ డైమెన్షనల్ పవర్ ఉంది. ఆ మూడు.. సంస్కరణలకు అనుకూల సర్కారు. తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం, ఆశావహ మార్కెట్. టెక్నాలజీ రుచిఏంటో తెలిసిన ఇలాంటి మార్కెట్ మరో చోట దొరకడం కష్టం అని భారత్ లో వృద్ధికి అనుకూలమైన వాతావరణం గురించి మోదీ వారికి వివరించారు.

కరోనాకు పుట్టిల్లయిన చైనాలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన ఆంక్షలు అమలు చేయడంతో  ఆ దేశ దిగుమతులపై ఆధారపడిన పలు దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. అలా ఇబ్బందులకు గురైన విభాగాలలో సెమీకండక్టర్ల రంగం కూడా ఉంది. దీంతో చాలా దేశాలు సెమీకండక్టర్ల తయారీకి ప్రత్యామ్నాయంగా భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి.  సెమీకండక్టర్ల తయారీ రంగంలో దేశీయ నిపుణులకు వారి  నైపుణ్యానికి పెద్ద పీట వేస్తామని   మోడీ స్పష్టం చేశారు.