calender_icon.png 8 February, 2026 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమాత్యుల బాధ ఇంతంత కాదు!

08-02-2026 01:14:03 AM

  1. పురపోరులో సొంత నియోజకవర్గాలపైనే ఫోకస్ 
  2. ఇన్‌చార్జ్ నియోజకవర్గాలకు చుట్టపు చూపుగానే..

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర మంత్రులకు సంకటంగా మారాయి. ఒకవైపు సొంత నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం, మరో వైపు ఇన్‌చార్జ్‌గా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడం, పార్టీ నేతలను సమన్వయం చేయ డం పెద్ద టాస్క్‌గా మారింది. ఎన్నికల ప్రచారానికి ఇక రెండు రోజులే మిగిలి ఉండటంతో ఆమాత్యుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ఎందుకంటే, సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో విజయం సాధిం చకుంటే.. భవిష్యత్‌లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇన్‌చార్జ్‌గా ఉన్న పార్లమెంట్ నియోజక పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీ విజ యం సాధించకపోయినా ఫెయిల్యూర్‌ను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు సొంత జిల్లా, లేదం టే నియోజకవర్గంలోనే ఎక్కువగా సమ యం కేటాయిస్తూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు.

ఇన్‌చార్జ్‌గా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలకు మాత్రం చుట్టపు చూపుగానే వెళ్లుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించిన తర్వాత ఒకసారి వెళ్లి.. పార్టీ నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మున్సిపల్, కార్పోరే షన్‌కు సంబందించి వార్డులు, డివిజన్లలో ఒకటి రెండుసార్లు వెళ్లిన మంత్రులు కార్నర్ మీటింగ్‌లకు హాజరయ్యారు. ఆ వెంటనే తమ జిల్లాలు, నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారంలో నిమగ్నమయ్యారు.

మంత్రి కోమటి రెడ్డికి మల్కాజ్‌గిరి బాధ్యతలు అప్పగించినప్పటికీ నల్లగొండ కార్పోరేషన్‌ను కైవసం చేసుకునేందుకే ఆయన ఎక్కువగా శ్రమిస్తున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నిజాబా బాద్ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పటికీ.. ఎక్కువగా హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్‌కు కంటే ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలపై దృష్టి సారించారు.

మంత్రి శ్రీధర్‌బాబు కూ డా చేవేళ్ల బాధ్యతలు ఉన్నా తన సొంత ని యోజకవర్గమైన మంథనితో పాటు ఉమ్మడి కరీంనగర్‌పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సీతక్క భువనగిరి పార్లమెంట్‌లో పరిధిలో ఒకటి రెండుసార్లు ప్రచారం చేసినా ములుగుతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఒకటి రెండుసార్లు నల్లగొండలో పర్యటించినా ధర్మపురిలో పార్టీ విజయం కోసం శ్రమిస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ కూ డా సొంత జిల్లా వరంగల్‌తో పాటు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దామోదర రాజనరసింహ కూడా  మహబూబ్‌నగర్ కంటే ఎక్కువగా ఆందోల్‌పైన దృష్టి సారించారు. మెదక్‌కు మంత్రి వివేక్, నాగర్‌కర్నూల్‌కు వాకిటి శ్రీహరి, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, మహబూ బాబాద్‌కు పొన్నం ప్రభాకర్, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావులు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నా రు. వారు సొంత నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకోవడంపైనే దృష్టిపెట్టారు.