calender_icon.png 8 February, 2026 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్, రేవంత్.. రాహుకేతువులు

08-02-2026 01:08:01 AM

  1. నేటికీ దోపిడీకి గురవుతున్న తెలంగాణ 
  2. కాంగ్రెస్‌ది అసమర్థ పాలన
  3. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
  4. మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం

మంచిర్యాల/కాగజ్‌నగర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిలు రాహు, కేతువులు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. తెలంగాణ -నేటికీ దోపిడీకి గురవుతున్నదని వ్యాఖ్యానించారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థుల తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశా రు.

ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో తెలం గాణకు మిగులు బడ్జెట్ ఉండేదని, అప్పుల పాలయ్యే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత బీఆర్‌ఎస్ పాలకులకే దక్కుతుందన్నారు. తెలంగా ణలో పరివర్తన జరుగుతుందని ప్రజలు ఆశించారని, కానీ ఆ ఆశలు నెరవేరలేదని వ్యాఖ్యా నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ రేవంత్‌రెడ్డి పాలనలోనూ రాష్ట్రం లో దోపిడీ కొనసాగుతూనే ఉన్నదన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో నిజమైన పరివర్తన జరుగుతుందని జోస్యం చెప్పా రు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజే పీ ప్రభుత్వం 15 ఏళ్లలో సాధించిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బెని ఫిట్స్ సకాలంలో అందుతున్నాయని తెలిపారు.

కానీ తెలంగాణలో మాత్రం ఉద్యోగు లు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ సమయానికి అందడం లేదని విమ ర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి బీద రాష్ట్రంగా మారుస్తున్నాయని ఆరోపించారు. కమీషన్ల కాంగ్రెస్ పాలనలో ఉద్యో గులు, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి జరుగుతోందన్నారు. మున్ముం దు మున్సిపాలిటీల అభివృద్ధి మరింత వేగం గా సాగాలంటే బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర పథకాల ద్వారానే తాగునీటి వసతులు, డ్రైనేజీలు, రోడ్లు తదితర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటేస్తే రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి పనుల కోసం నిధుల కొరత ఉంద ని వ్యాఖ్యానించారు. మంచిర్యాలలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌లో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే డా.పాల్వయి హరీష్‌బాబు, ఎమ్మెల్సీ కొమురయ్య పాల్గొన్నారు.