9 April, 2026 | 7:11 AM

‘ఓటుకు నోటు’లో ఆధారాలు లేకుండా చేసేందుకేనా..?

08-02-2026 01:59 AM

అగ్ని ప్రమాదంపై కేటీఆర్ అనుమానం

 హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 07 (విజయక్రాంతి): హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేర కు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు.. సీఎం రేవంత్ రెడ్డి’ అని ప్రశ్నించారు.