3 August, 2026 | 2:56 AM

మోదీకి మతిమరుపు ఎక్కువైంది

22-05-2024 02:43 AM

నిన్న చెప్పింది ఈ రోజు మరిచిపోతున్నారు

మైనారిటీల గురించి మాట్లాడలేదంటున్నారు

ఆయనో అబద్ధాల మనిషి అనేందుకు ఇదే నిదర్శనం

కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ, మే 21: ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగాలన్నీ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయని, ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. మైనారిటీలకు వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదని, బీజేపీ వారికి వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని మోదీ చెప్పడాన్ని ఆయన తప్పు బట్టా రు.

ఏప్రిల్ 19 నుంచి మోదీ ప్రచారంలో దృష్టి అంతా మత విద్వేషాలను రెచ్చగొట్టడంపైనే ఉందని, హిందూ విభజించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. వికసిత్ భారత్, మోదీ గ్యారెంటీలు లేదా రైతులు, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. మోదీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుస్తోందా? ఆయనకు మతిమరుపు వచ్చిన ట్లుంది. మోదీ ఎప్పుడూ సత్యానికి కట్టుబడి లేరు. నిన్న చెప్పింది ఈ రోజే మరిచిపోతున్నారు. నేనెప్పుడు అలా చెప్పలేదం టున్నారు’ అని రమేశ్ దుయ్యబట్టారు. 

అందుకే మోదీ మౌనం

మంగళసూత్ర వ్యాఖ్యలు, మత ప్రాదిపదికన కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పిస్తుందని ఆరోపణలను మోదీ లేవనెత్తారని, అవన్నీ బూటకపు ప్రకటలని ఆయన చెప్పారు. గుజరాత్ అల్లర్ల గురించి ఒకసారి మాట్లాడుతూ.. కారు కిందకు వచ్చిన చిన్న కుక్క పిల్ల కూడా బాధపడుతుందని మోదీ చెప్పారని మండిపడ్డా రు. మోదీ తన ప్రసంగాల ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టి కాంగ్రెస్‌ను ఆ దారిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము వాటికి లొంగబోమని చెప్పారు.