15 April, 2026 | 12:27 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం

17-06-2025 01:21 AM

-‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’తో సత్కారం

-సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలెడెస్‌తో భారత ప్రధాని భేటీ

-ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్

-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై ఇరుదేశాల నేతల ఆందోళన

-జీ సమావేశాల్లో పాల్గొనేందుకు కెనడాకు పయనం

న్యూఢిల్లీ, జూన్ 16: భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఈ సందర్భం గా మోదీకి సైప్రస్ దేశ అత్యున్నత పురస్కా రం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియో స్ 3’ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమన్నారు.

రెండు దేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబకం భావనకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ అవార్డును ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ గుర్తింపు ఇరుదేశాల శాం తిభద్రతలు, సార్వభౌమాధికారం, ప్రాంతీ య సమగ్రత, శ్రేయస్సుపై పరస్పర నిబద్ధతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నా రు.

భారత్ మధ్య ఉన్న క్రియాశీల భాగస్వామ్యం భవిష్యత్తులో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థ శక్తిగా భారత్ ఎదుగుతుందని ఆకాంక్షించా రు.  ఈయూ అధ్యక్ష పదవి సైప్రస్‌కు రావడంపై ఆ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలెడెస్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యా రు. ఇరు దేశాల నేతలు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్య క్తం చేశారు.

ఇది యుద్ధాల యుగం కాదని, ఎలాంటి సమస్యనైనా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడమే సరైనద న్నారు. అనంతరం ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక సంబంధాలు, పలు కీలక అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.  రక్షణ, భద్ర త, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై దృష్టి సారించినట్టు  మోదీ వెల్లడించారు. 

కెనడాకు ప్రధాని మోదీ..

రెండు రోజుల సైప్రస్ పర్యటనను ము గించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ జీఫుx7 సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు పయనమయ్యారు. జీఫు7 సదస్సు అనంతరం అక్కడి నుంచి క్రొయేషియా పర్యటకు బయల్దేరి వెళ్లనున్నారు.