బంగ్లాదేశ్ ప్రధానికి మోడీ వెల్ కమ్
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల ప్రారంభంలో దేశ రాజధానికి వచ్చిన హసీనా నెల వ్యవధిలో ఇది రెండో పర్యటన. ద్వైపాక్షిక సంప్రదింపులు జరపడానికి ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు హసీనా శుక్రవారం న్యూఢిల్లీకి వచ్చారు. భారత్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని శుక్రవారం సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమయ్యారు. తన పర్యటనలో ఆమె ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంప్రదింపులు జరపడంతో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్‌లతో సమావేశం కానున్నారు.






