29 June, 2026 | 10:24 AM

విదేశాల్లో మోదీ పర్యటన

15-06-2025 12:42 AM

-సైప్రస్, కెనడా, క్రొయేషియాలో ఐదురోజుల పాటు పర్యటన

- జీ సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూన్ 14: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటకు వెళ్లనున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో ఐదురోజుల పాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా వెల్లడించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధా ని ఆ దేశంలో జూన్ 15 తేదీల్లో పర్యటించనున్నారు.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే. పర్యటనలో భాగం గా సైప్రస్ అధ్యక్షుడితో చర్చ లు జరపనున్నారు. దీనితో పాటు వ్యాపారవేత్తలను ఉద్దే శించి ప్రసంగం చేయను న్నారు. అక్కడి నుంచి ప్రధాని కెనడాకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని, మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16 కననాస్కిస్‌లో జరగనున్న జీ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సు లో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా ఆరోసారి. ఇందులో భాగంగా జీ దేశాధినేతలతో సమావేశం కానున్నారు. తిరుగు ప్రయాణంలో జూన్ 18న మోదీ క్రొయేషియాకు వెళ్లనున్నారు.