అగ్రహారం కరీంనగర్ డెయిరీ దూద్‌పేడలో బూజు
ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారుడు
మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 29 (విజయక్రాంతి): జిల్లాలో వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం కరీంనగర్ డెయిరి లో బూజు పట్టిన దూదుపేడాలను విక్రయించడంపై వినియోగదారుడు సంటి రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఓ పని నిమిత్తం సిరిసిల్లకు వెళ్ళిన ఆయన తిరుగు ప్రయాణంలో అగ్రహారం డెయిరి వద్ద దూద్ పేడను కొనుగోలు చేశాడు. దూద్ పేడ బూజు పట్టి ఉండడంతో, అక్కడున్న సిబ్బందిని అడగగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ వినియోగదారుల ఆరోగ్యాలను పట్టించుకోకుండా, ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా, వినియోగదారుల హక్కులను కాల రాస్తున్న అగ్రహారం కరీంనగర్ డెయిరి పై హైదరాబాద్ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లుఆయనతెలిపారు.






