30-10-2025 12:00:00 AM
తాడ్వాయి, అక్టోబర్, 29 ( విజయ క్రాంతి): టేక్రియాల్ హైవే నుంచి చందాపూర్ గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ ను గ్రామస్తులు కోరారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్‌ను కలిసి సమస్యలు వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల కోరుత ఉందని,పాఠశాల ప్రహరీ నిర్మాణానికి వెంటనే కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.టెక్రియాల్ నుంచి చందాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని ప్రస్తుతం సింగిల్ రోడ్ ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. గ్రామం లో సిసి రోడ్లు నిర్మించాలని కోరారు. వీటిపై స్థానిక ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. నాయకులు నరసారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.