calender_icon.png 13 February, 2026 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెబ్ కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణ

13-02-2026 01:36:02 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడీఓసీ కార్యాలయం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి దశను పర్యవేక్షిస్తూ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా లెక్కింపు జరుగుతున్నదని తెలిపారు.

కౌంటింగ్ హాళ్లలో భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేయబడినట్లు, ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్లు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ బాక్సుల సీల్స్ పరిశీలన, ఓట్ల లెక్కింపు, రౌండ్ వారీ ఫలితాల నమోదు వంటి అంశాలను జిల్లా స్థాయి నుండి నిరంతరం పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రక్రియ కొనసాగేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు.