10 March, 2026 | 5:48 AM

చిట్యాల లో ట్రాన్స్ జెండర్ ఘన విజయం

13-02-2026 01:38 PM

చిట్యాల, ఫిబ్రవరి 13(విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డులో శుక్రవారం వెలువడిన ఫలితాలలో ట్రాన్స్ జెండర్ ఘనవిజయం సాధించారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో శివనేనిగూడెంకు చెందిన ఒకటవ వార్డు లో ట్రాన్స్ జెండర్ అయిన  ఇండిపెండెంట్ అభ్యర్థి నాగిళ్ల సుధాకర్ 109 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ గెలుపొందారు. వివిధ ప్రధాన పార్టీల పోటీని తట్టుకొని  102 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, వార్డులోని సమస్యలకు కృషి చేస్తానని, తనను గెలిపించిన ప్రజలకు సుధాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.