సామ్రాజ్యలక్ష్మిగా భద్రకాళి
16-05-2024 01:43 AM
వరంగల్, మే 15 (విజయక్రాంతి): వరంగల్ భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారు సామ్రాజ్యలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని సామ్రాజ్యలక్ష్మిగా అలంకరించి, ఊరేగించారు. వేడుకలకు హాజరైన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, అమ్మవారి దర్శనం ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి పర్యవేక్షించారు. కార్యక్రమంలో కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవునూరి రామ్మూర్తి, రుద్రారపు కుమారస్వామి, ఓంప్రకాశ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.




