10 June, 2026 | 8:08 PM

నిర్మల్ పట్టణంలో కోతుల పట్టివేత

10-06-2026 07:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బెస్తవార్పేట్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక కోతుల పట్టివేత కార్యక్రమంలో మొత్తం 67 కోతులను పట్టుకొని కవ్వాల్ అటవీ ప్రాంతానికి సురక్షితంగా బుధవారం తరలించారు. పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. పట్టుబడిన కోతులను కవ్వాల్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టనున్నట్లు తెలిపారు.