10 June, 2026 | 7:52 PM

డ్రగ్స్ నిర్మూలనకు విస్తృత వాహన తనిఖీలు

10-06-2026 07:06 PM

చివ్వెంల ఎస్సై మహేశ్వర్

చివ్వెంల,(విజయక్రాంతి): డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా నివారణలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాలు, డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచనల మేరకు చివ్వెంల మండలం గుంపుల శివారులోని సారంగి హోటల్ సమీపంలో జాతీయ రహదారి–65పై బుధవారం విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పోలీస్ జాగిలం సహాయంతో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు.

కార్యక్రమంలో చివ్వెంల ఎస్సై మహేశ్వర్, పోలీసు సిబ్బంది, సూర్యాపేట జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మహేశ్వర్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని, నిషేధిత మాదక ద్రవ్యాలను వినియోగించినా, తరలించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.