03-02-2026 12:00:00 AM
విన్నుత నిర్ణయం తీసుకున్న సర్పంచ్ సంధ్యబనేష్
మంథని, ఫిబ్రవరి 2(విజయ క్రాంతి) మంథని మండలంలోని గు ంజపడుగు గ్రామం లో ఇక కోతుల బెడద కు స్థానిక సర్పంచ్ చెక్ పె ట్టారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో వినూత్నంగా ఆలోచించి ఒక మనిషికి చింపాంజీ వేషం వేయించారు. దీంతో అ చింపాంజీ వేషంలో ఉన్న మనిషి గ్రామంలో ఊరంతా తిరుగుతూ కోతులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అ చిం పాంజీ రూపంలో ఉన్న మనిషి ని చూసిన కోతులు భయంతో బింబలెత్తిపోయి పరుగెత్తుతున్నాయి.
ఇది చూసిన గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా విన్నుతో నిర్ణయం తీసుకున్న సర్పంచిని పంచాయతీ కార్యదర్శిని పాలకవర్గాన్ని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ దండవేన సంధ్య - బానేష్ తో కార్యదర్శి భానుప్రసాద్, పాలకవర్గం గ్రామస్తులు పాల్గొన్నారు.