28 June, 2026 | 3:43 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

పారమిత పాఠశాలలో రాష్ట్రస్థాయి అవార్డుల ప్రధానం

03-02-2026 12:00 AM

ముకరంపుర, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి)పారమిత పాఠశాలలో రాష్ట్ర స్థాయి విజ్ కిడ్ కాంటెస్ట్ అవార్డుల ప్రధానోత్సవం స్థానిక పద్మనగర్ లోని పారమిత హెరిటేజ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన విజ్ కిడ్ కాంటెస్ట్ అవార్డు బహుమతి ప్రధానోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ పారమితేతర పాఠశాలల నుండి 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 3000 కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి నుండి పదిమంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, నగదు ప్రోత్సాహకాలు మరియు ప్రతీ తరగతి లో మెదటి బహుమతి 20,000/- , రెండవ బహుమతి 15,000/-, మూడవ బహుమతి 10,000/-, నాల్గవ, అయిదవ బహుమతులుగా ఒక్కొక్కరి కి 5,000/- చొప్పున ఇస్తూ, 6 నుండి 10 వ స్థానాలలో నిలిచిన విద్యా ర్థులకు ఒక్కొక్కరికీ 2000 రూపాయల చొప్పున 60 మంది విద్యార్థులకు మొత్తం నగదు పురస్కారం దాదాపు 4 లక్షల రూపాయల ను పారమిత విద్యా సంస్థల చైర్మన్ డా|| ఇ.ప్రసాదరావు గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో సమగ్ర అభివృద్ధిని , నేర్చుకోవాలనే ఆసక్తిని మరియు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించడానికి మరియు విద్యార్థులలో గణితం మరియు సైన్స్ ప్రతిభను వెలికి తీసే సదుద్దేశంతో ఈ పరీక్ష ను ప్రతీ సంవత్సరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత పాఠశాలల డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు,రశ్మిత, రాకేశ్, వినోద్ రావు, వి.యు.యం. ప్రసాద్, హ న్మంత రావు మరియు ప్రిన్సిపాల్ గోపీకృష్ణ సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు మరియు గెలుపొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు, పాల్గొన్నారు.