3 August, 2026 | 3:31 PM

బాగలవాడలో కోతుల పట్టివేత

03-08-2026 02:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని (వార్డ్ నెం.30) బాగులవాడ, బూలక్ష్మి టెంపుల్ దగ్గరలో కోతుల పట్టివేత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మొత్తం 31 కోతులను పట్టుకొని రంగులు చల్లి కవ్వాల్ అటవీ ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక కౌన్సిలర్ ఎస్పీ రాజు సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ మరియు కాలనీ వాసులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.