పాత్రికేయులకు 1/3 పాసులు ఇవ్వాలి
03-08-2026 02:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): పత్రిక రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులకు 1/3 రాయితీ పాసులు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేసే నియోజకవర్గం జర్నలిస్టులకు 1/3 పాసులు ఇవ్వాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ స్వామి, జిల్లా జర్నలిస్టులు రాహుల్, భీమేష్, రాజేందర్ మల్లేశ్వర్ తదితరులు ఉన్నారు.






