3 August, 2026 | 4:28 PM

ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

03-08-2026 03:24 PM

బోథ్,(విజయక్రాంతి): ఈ నెల 9న నిర్వహించనున్న ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని న్యాయవాది పంద్రం శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పిప్పల్ దరి జీడిపల్లి గ్రామాలలో ఆదివాసి దినోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు ప్రతి ఒక్కరు ఆదివాసి దినోత్సవం రోజున పండుగ జరుపుకున్నట్లే ఉండాలన్నారు. యువకులు మహిళలు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సార్ మేడి ఆడం భీమ్రావు కరత్వాడ సర్పంచ్ ధ్రువ విశ్వేశ్వరరావు పిప్పలదరి సర్పంచ్ మిశ్రమానసూయ మండాడి నాగరావ్ తులసమ్మ గోపాల్ లతోపాటు ఆయా గ్రామాల పటేళ్లు పాల్గొన్నారు