పిచ్చి మొక్కలు తొలగించిన సర్పంచ్
03-08-2026 03:12 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో వర్షాలతో పెరిగిన పిచ్చి మొక్కలను సోమవారం సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి తమ పంచాయతీ సిబ్బందితో. మురుగు కాలువలను,విధుల్లో పెద్దగా పెరిగిన మొక్కలను తొలగించి, గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సర్పంచ్ కొండి రాజ్య లక్ష్మి స్వామి మాట్లాడుతూ... గ్రామ ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇవ్వాలని, ఇళ్ల వద్ద నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత కుండలను తొలగించాలని ఆమె ప్రజలకు సూచించారు.






