30 June, 2026 | 11:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మాన్సూన్ టీం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు

24-07-2025 12:32 AM

సిద్దిపేట క్రైమ్, జూలై 23 : వర్షాల దృష్ట్యా సిద్దిపేట పట్టణ ప్రజల సౌకర్యార్థం మాన్సూన్ టీం ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ తెలిపారు. ఈ టీం సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని, మున్సిపల్ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే 9505507248 నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలపాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తామన్నారు.

పట్టణంలో శిథిలావస్థకు చేరిన గృహాల యజమానులకు నోటీసులు జారీ చేసి, ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. బుధవారం ఆయన పట్టణంలోని 1వ వార్డు లింగారెడ్డిపల్లిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురుగు కాలువలను శుభ్రం చేయించి పిచ్చి మొక్కలు, చెత్త తొలగించాలనిసిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ సిబ్బందికి గ్లౌజులు, బూట్లు, రెయిన్ కోట్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.