24-07-2025 12:31:58 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కాగజ్‌నగర్, జూలై 23 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. బుధవారం ఆసిఫాబా ద్ మండలం అడ పిహెచ్‌సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వ, పరిసరాలను పరిశీలించి, వైద్య సేవలు పొందుతున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.
పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ఔషధ నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది ముం దస్తు అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడి తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులను ప్రసవం కొరకు సురక్షిత ప్రాం తాలకు తరలించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ అధికారి సీతారాం పాల్గొన్నారు.