24-07-2025 12:33:09 AM
డీఎం అండ్ హెచ్‌ఓ హరీష్‌రాజ్
మంచిర్యాల, జూలై 23 (విజయక్రాంతి) : వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాదులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ హరీష్ రాజ్ ఆదేశించారు. బుధ వా రం నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు తెలంగాణ డయాగ్నొస్టిక్ ను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్సీల పరిధిలోని గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట ఆసుపత్రిలో సాయంత్రం వరకు ఒక వైద్య సిబ్బంది ఉం డే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యులు, వైద్య సిబ్బంది వివరాలు అందుబాటులో ఉంచాలని, రౌండ్ క్లాక్ ఆరోగ్య కేంద్రాలలో సాయంత్రం పూట, రాత్రి ఉండే సిబ్బంది వివరాలు అందజేయాలన్నారు.