12-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : గత నెలలో మొంథా తుఫాను రై తులను నిండా ముంచిందనివ్యవసాయ శా ఖ సర్వేలో వెల్లడైంది. తుఫాన్ కారణంగా రా ష్ట్ర వ్యాప్తంగా 1,17,757 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ ప్ర భుత్వానికి నివేదిక సమర్పించింది. తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన జిల్లాల్లో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సిద్ధం చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ర్టంలో 33 శాతానికి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించినట్లు తెలిపారు. 27జిల్లాల్లోని 1,22,142 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్‌డీఆర్‌ఎప్ కింద ఇసుక మేటలకు ఎకరానికి రూ. 7, 285, నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి రూ. 6,880-, వర్షాధార పంటలకు రూ. 3,440, - తోటలకు ఎకరానికి రూ. 9,106 - చొప్పున మొత్తం రూ. 70 కోట్ల నిధులు రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని తెలిపారు.
గతంలో వరదలు సంభవించినప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని మంత్రి పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొన్నదని తెలిపారు. ఈ పంట నష్టం వివరాలు కూడా కేంద్రానికి పంపి ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద కేంద్రాన్ని నిధులు అడుగుతామని, ఇప్పటికే మొంథా తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపించాలని కోరనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే పంటనష్టపోయిన రైతులకు రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి రూ. 10,000 చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.