calender_icon.png 12 November, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్

11-11-2025 11:08:55 PM

స్మార్ట్ పోల్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు..

ఖైరతాబాద్ (విజయక్రాంతి): పదేళ్ల నుండి సర్వే రంగంలో విజయవంతంగా సర్వేలు నిర్వహిస్తున్న స్మార్ట్ పోల్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబందించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చివరి మూడు రోజులు అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా పరిస్థితి మారిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల ప్రజలు ఎక్కువ శాతం మొగ్గు చూపారన్నారు. అధికార కాంగ్రెస్ 6.2% ఓట్ల తేడాతో గెలవనున్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెళ్ళడయ్యిందన్నారు. కాంగ్రెస్ కు 47.6%, బిఆర్‌ఎస్‌కు 38.4%, బీజేపీ 11.4%, ఇతరులు 2.6% ఓట్ల శాతం సాధించనున్నట్లు ఆయన తెలిపారు. షేక్ పేట్ డివిజన్ మినహాయించి మిగతా అన్ని డివిజన్ లలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతంలో ఆధిక్యం సాధించనున్నట్లు తమ సర్వే లో తేలిందన్నారు...

బీహార్ ఎన్నికలు...

బీహార్ ఎన్నికలలో ఎన్ డి ఎ కూటమి 46.34 ఓట్లతో అధికారంలోకి రానున్నట్లు తమ సర్వేలో వెల్లడైందన్నారు. మహా ఘట్ బంధన్ కు 41.53%, జన్ సురాజ్ పార్టీ కి 6.76%, ఎం ఐ ఎం 1.05%, ఇతరులు 4.32% సాధిస్తాయని తమ సర్వేలో తేలిందన్నారు. ప్రతీ బూత్ కు పది మంది చొప్పున పూర్తి నియోజకవర్గంలో 4700 శాంపిళ్లను తీసుకుని ఈ సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ పోల్ సంస్థ ప్రతినిధులు సతీష్, శ్రీనివాస్ రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.