12-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): బండారు వైష్ణవ్ మెమోరియల్ ఫౌండేషన్, స్టాన్లీ మహిళా ఇంజనీ రింగ్ కళాశాల సంయుక్తంగా మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం స్టాన్లీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ డా. వి అనురాధ అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా బండారు దత్తాత్రేయ, (హర్యానా మాజీ గవర్నర్), విజయలక్ష్మి (చైర్ పర్సన్, వైష్ణవ్ మెమోరియల్ ఫౌండేషన్), ప్రొఫెసర్ డి రవీందర్ యాదవ్ (పూర్వ ఉపకులపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం), ఆచార్య కొలకనూరి ఇనాక్ (పూర్వ ఉపకులపతి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) హాజరయ్యారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. నవంబర్ 11న మన దేశపు ప్రథమ విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జా తీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు.
‘మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యను ఒక జాతి అభివృద్ధికి మూలాధారంగా చూశారు. సమాజంలోని ప్రతి బాలు డు, బాలిక విద్యను పొందడానికి ఆయన కృషి చేశాడని తెలియజేశారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 ఈ రకంగా అభివృద్ధిని కాంక్షిస్తూ తీర్చిదిద్దబడిందని గుర్తు చేశారు. విద్యను విలువైన ఆభరణంగా భావించి దానిని బలంగా చేసుకోవాలని ఆకాంక్షించారు.
విజయలక్ష్మి మాట్లాడుతూ విద్య ఒక వ్యక్తిని జ్ఞానవంతునిగా మాత్రమే కాకుండా బాధ్యత కల పౌరుడిగా మలుస్తుందని చెప్పారు. విద్యావంతులైన యువతే కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, సమాజసేవ, ఆర్థిక పురోగతికి దారితీస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టాన్లీ కళాశాల కరస్పాండెంట్ కే కృష్ణారావు, మేనే జ్మెంట్ సభ్యులు టి రాకేష్‌రెడ్డి, ఆర్ ప్రదీప్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి ఎల్ రాజు, డీన్ ప్రొఫెసర్ ఏ వినయ్ బాబు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ రమేష్, అధ్యాపకులు డా. జి శిరీష, డా.విద్యాభార్గవి పాల్గొన్నారు.