మొంథా వరద బాధితులకు రూ.12.99కోట్లు
- 15 జిల్లాల్లో 8,662 ఇళ్లకు ఆర్థికసాయం
- ఒక్కో ఇంటి మరమ్మతుకు రూ.15వేల చొప్పున..
- నిధులు విడుదల చేసిన సర్కార్
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : మొంథా తుఫాన్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ ఆర్థికసాయం మంజూరు చేసింది. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు రూ. 12.99 కోట్లు విడుదల చేసింది. 15జిల్లాల్లో 8,662 ఇళ్లకు రూ. 15 వేల చొ ప్పున ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబాలకు అందించనున్నారు. ఈ మేరకు రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబర్ 17 నుంచి 30 తేదీ వరకు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షా లు కురిశాయి. వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, యాదా ద్రి భువనగిరి, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ జిల్లాలు తుఫాన్‌కు ప్రభావితమయ్యాయి. తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపై ఇప్పటికే కలెక్టర్లు రాష్ట్ర ప్రభు త్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు.




