13 April, 2026 | 4:18 AM

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ వార్షికోత్సవం

12-11-2025 12:00 AM

14 నుంచి- 19 వరకు నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ఏడవ వార్షిక బ్ర హ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 19 వరకు ఘనంగా జరగనున్నాయి. 2018లో ఆరంభమైన స్వర్ణ దేవాలయంలో స్వయం భూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, రాధాగోవింద ప్రధా న విగ్రహాలుగా వెలసి నిత్యం పూజలు అం దుకుంటున్నారు.

వీరితో పాటు పాంచజన్యేశ్వర స్వామి, జలగర్భ శాలిగ్రామ శిల, జప ఆంజనేయ స్వామి, ఆచార్య పరంపరా ప్రతిష్ఠించబడ్డాయి. 14న శ్రీ లక్ష్మీనర సింహ స్వామి మూలవరు, ఉత్సవమూర్తుల అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతా యి. 17, 19 తేదీల్లో భూసమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం, రాధాగోవింద దేవు ల 108 కలశ మహాచూర్ణాభిషేకం, మహాసంప్రోక్షణ వంటి ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి.

ప్రతిరోజూ దేవతామూర్తులకు విశే షాలంకారాలు, పుష్పాలంకరణలు, నూ తన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి, హరినామ సంకీర్తనాలతో ఆలయ ప్రాం గణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో మార్మోగనుంది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, బ్రహ్మోత్సవ ఆహ్వాన పోస్టర్, కార్యక్రమ వివరాలను హరేకృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూ (ఎంటెక్, ఐఐటీ మద్రాస్) విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. తెలంగాణ తొలి గోల్డెన్ టెంపు ల్లో 7వ శ్రీ బ్రహ్మోత్సవాన్ని ఆరు రోజులపాటు భక్తి భావంతో జరుపుకుంటున్నాము. అందరూ ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొని పరమాత్ముని దివ్య కృపను పొందాలని కోరుతున్నాము అని అన్నారు.