కొడుకు సహా తల్లి ఆత్మహత్య
26-03-2026 12:16 AM
బావిలో దూకి బలవన్మరణం
రాజన్న సిరిసిల్ల, మార్చి 25 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగంపేటలో బుధవారం మూడేళ్ల కొడుకుతో కలిసి బావిలో దూకి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన ఎలవేణి రేఖ (25)కు ఐదు సంవత్సరాల క్రితం ఇల్లంతకుంట మండల కేంద్రా నికి చెందిన దుర్ముట్ల బాబుతో వివాహం అయింది.
వారికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే కొన్ని రోజులుగా రేఖ మతి స్థిమితంతో బాధపడుతున్నది. ఆరు నెలలుగా కొడుకుతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నది. బుధవారం సాయంత్రం తమ ఇంటి పక్కనే బావిలో కొడుకుతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




