రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి
26-03-2026 12:17 AM
ఎర్రుపాలెం మార్చి 25 (విజయక్రాంతి): బుధవారం నాడు మండల కేంద్రంలోని స్థానిక రింగ్ సెంటర్ నందు రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ఎస్త్స్ర రవికుమార్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, వాహనం నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ను ధరించాలని, ప్రతి ఒక్కరూ లైసెన్సును కలిగి ఉండాలని, చిన్నపిల్లల చేత డ్రైవింగ్ చేయించరాదని, మత్తు పదార్థాలను సేవించి డ్రైవింగ్ చేయరాదని, రోడ్డు ప్రమాదల పట్ల జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాజీవ్ గాంధీ, పుప్పాల చంద్రమౌళి , ఏఎస్‌ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.




