ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
18-07-2026 12:18 AM
- వెల్దండ మండలం పోతేపల్లిలో విషాదం
- కుటుంబ కలహాలా? ఆర్థిక ఇబ్బందులా?
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కల్వకుర్తి, జూలై 17 (విజయక్రాంతి): ఇద్దరు చిన్నారులతో ఓ తల్లి నీటి సంపులో పడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం, పోతేపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శిరీష (25)కు రెండేళ్ల కుమార్తె, మూడు నెలల కుమారుడితో కలిసి ఆత్మహ త్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.






